బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరేట్ జోడి అనగానే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ గౌతమ్ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి ఏ షోలో కనిపించినా అక్కడ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ గ్యారంటీ. వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సంభాషణలు, రష్మీతో సుధీర్ ఫ్లర్ట్ చేసే విధానం లాంటివి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే.. మొన్నటివరకూ ఢీ డాన్స్ షోలో, ఎక్సట్రా జబర్దస్త్ లో సుధీర్ – రష్మీ చేసిన సందడి గురించి తెలిసిందే.
ఏమైందోగానీ ఇద్దరూ ఢీ షో నుండి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎక్సట్రా జబర్దస్త్ లో సుధీర్ లేకుండా రాంప్రసాద్ స్కిట్స్ చేస్తున్నాడు. సుధీర్ లేకుండా జబర్దస్త్ లో రష్మీ మాత్రమే కనిపించేసరికి ఫ్యాన్స్ ఎంటర్టైన్ మెంట్ చాలా మిస్ అవుతున్నారు. మళ్లీ సుధీర్, రష్మీల జంటగా ఎప్పుడు చూస్తామా.. అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకూ టీవీ ఢీలో, జబర్దస్త్ లో రష్మీపై సుధీర్ చాలాసార్లు తన ప్రేమను బయటపెట్టిన సంగతి తెలిసిందే.అదేవిధంగా అప్పుడప్పుడు రష్మీ కూడా సిగ్గుపడుతూ సుధీర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా యాక్ట్ చేసేది. అదంతా స్కిట్ వరకే అనుకున్నా ఈ జంట పండించే వినోదాన్ని ప్రేక్షకులు కూడా మిస్సవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమోలో రాంప్రసాద్ స్కిట్ లో రష్మీ చెల్లి పాత్ర చేసింది. అలాగే తనకు పెళ్లి ఇష్టం లేదంటూ మనసులో ఒకడు ఉన్నాడంటూ చెప్పిన మాటలు.. సుధీర్ ని ఉద్దేశించినవే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంతకీ రష్మీ ఏమని మాట్లాడిందంటే.. “నేనొకడ్ని ప్రేమించాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మనం మనస్ఫూర్తిగా ఒకడికి మనసిస్తే.. ఈ గుండె చప్పుడు ఆగినంతవరకూ మనసులో స్థానం వాడికి మాత్రమే. మనకి ఇష్టమున్న వాళ్ళు మన పక్కన లేకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు” అంటూ ఎమోషనల్ అయ్యింది. రష్మీ చెప్పిన డైలాగ్స్ అన్ని సుధీర్ పై ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న రష్మీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.