సెలబ్రెటీలు, ముఖ్యంగా సినిమా ఫీల్డ్‌లో ఉండే వారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరుస్తుంటారు. వారి లవ్ ఎఫైర్స్, పెళ్లి ముచ్చట్లు, వారి వైవాహిక జీవితంలోని ముచ్చట్ల గురించి తెలుసుకోవడానికి తెగ ఆరాటపడతారు కొందరు. గతంలో అయితే ఏదైనా ప్రత్యేక ఇంటర్వ్యూల్లో వీటి గురించి వస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగాకా.. అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ల గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా.. డైరెక్ట్ గా వారినే అడుగుతున్నారు. ఈ క్రమంలోనే దగ్గుబాటి వారసుడు, రానా తండ్రి కాబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయ్యాయి. ఇక ఈ వార్తలపై తాజాగా రానా భార్య మిహికా స్పందించారు. క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: రానా – శేఖర్ కమ్ముల కాంబోలో మరో సినిమా..?
రానా-మిహికాల వివాహం జరిగి ఇప్పటికి రెండేళ్లు కావస్తుండటం, ఈ మధ్య రానా భార్య మిహిక కాస్త బొద్దుగా మారడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. మిహిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే వార్త జోరుగా ప్రచారం అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా చిన్న క్లారిటీ ఇచ్చింది మిహిక. ‘నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది మేడం.. అందుకే అడుగుతున్నా.. మీరు ప్రెగ్నెంటా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో వెంటనే రియాక్ట్ అయిన మిహిక.. నో, నో అది మ్యారేజ్ వెయిట్ అని రిప్లై ఇచ్చింది. ఇలా తన ప్రెగ్నెన్సీపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేసింది మిహిక.
ఇది కూడా చదవండి: రానాకు క్లాస్ పీకిన హీరో సూర్య! ఇద్దరి మధ్య ఏమైంది?
2020 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన తన ప్రేయసి మిహిక బజాజ్‌ని పెళ్లాడారు రానా. కుటుంబ పెద్దలు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ జోడీని సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రేమ పక్షులిద్దరినీ అలా చూసి ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ తెలుగు ప్రేక్షకులు కితాబిచ్చారు. దీంతో టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో ఒకటిగా ఈ బ్యూటిఫుల్ జోడీ నిలిచింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం రానా.. వరుస పెట్టి ప్రాజెక్ట్‌లు చేస్తూ ఫుల్ బిజగా ఉన్నారు. త్వరలోనే వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఫైట్ లో ‘భీమ్లా నాయక్’ టెక్నిక్ వెనకున్న అసలు కథ ఇదే!