ఇటీవల కాలంలో సినీ నటులంతా డిజిటల్ బాటలో కూడా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటిటిలో వెబ్ సిరీస్/ఎంటర్టైన్ మెంట్ షోలలో అలరిస్తున్నారు. ఇక తెలుగు ఓటిటి ఆహా.. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు, టాలెంట్ షోలు నిర్వహిస్తుంది. మొన్నటివరకూ సింగింగ్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' నిర్వహించిన ఆహా.. ఇప్పుడు డాన్స్ ఐకాన్ అనే టాలెంట్ షోని ప్రవేశపెడుతోంది. పాపులర్ హోస్ట్ ఓంకార్ ప్రాతినిధ్యం వహించనున్న ఈ షో.. సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం కాబోతుంది. ఓంకార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీవీ షోలకు పెట్టింది పేరుగా అనిపించుకున్న ఓంకార్.. తెలుగులోని అన్ని ప్రముఖ ఛానల్స్ లో రియాలిటీ షోలు, టాలెంట్ షోలు నిర్వహించి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అలాగే మధ్యలో డైరెక్టర్ గా మారి జీనియస్, రాజుగారి గది, రాజుగారి గది 2 సినిమాలు తెరకెక్కించాడు. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహాలో డాన్స్ షో స్టార్ట్ చేస్తున్నాడు. అయితే.. ఈ షోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, నటి రమ్యకృష్ణ జడ్జిలుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో రమ్యకృష్ణ కూడా డాన్స్ ఐకాన్ ద్వారా డిజిటల్ స్టేజిపై మొదటిసారి కనిపించబోతుంది. ఇదిలా ఉండగా.. షోలో మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారని.. వారిని వేలం ద్వారా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ కొనుగోలు చేయనున్నారని సమాచారం. ఒక డాన్స్ షోలో ఏకంగా ప్రొడ్యూసర్స్ ఆక్షన్ అంటే మామూలుగా ఉండదని అంటున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో గీతాఆర్ట్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఇద్దరు కంటెస్టెంట్స్ చొప్పున వేలంలో తీసుకోనున్నారు. వీరికి లీడర్స్ శ్రీముఖి, యష్ మాస్టర్, మోనాల్ గజ్జర్ కాగా.. ఇందులో గెలిచిన కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ కి ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్లు టాక్. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఆహాలో స్ట్రీమ్ కానుంది. అయితే.. బాహుబలి సినిమాలో శివగామిగా పవర్ ఫుల్ రోల్ చేసిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించలేదు. కానీ, ఎమోషనల్ రోల్స్ తో ఆకట్టుకుంది. ఇటీవలే లైగర్ సినిమాలో హీరో తల్లిగా మెరిసింది. నటిగా ఫుల్ బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. ఫస్ట్ టైం ఓ షోలో సందడి చేయనుండటం హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ గా రమ్యకృష్ణ ఎన్నో సినిమాలలో అద్భుతమైన డాన్స్, గ్లామర్ తో మెప్పించి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. మరి అలాంటి రమ్యకృష్ణ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై జడ్జిగా ఎలా అలరిస్తారో చూడాలి. మరి రమ్యకృష్ణ ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Mamulga undadhu mari! Extra energetic performances & mundhu eppudu lenantha extra entertainment tho, mee kosam oka GRAND Gala Episode! Don't miss #DanceIkonOnAHA Grand Gala episode - Premieres September 11, 7 pm. ▶️ https://t.co/V7kKZ3JmvR@TheDeverakonda @ananyapandayy pic.twitter.com/eEH18iStmA — ahavideoin (@ahavideoIN) September 4, 2022 ఇదీ చదవండి: ఐ-బొమ్మ ఫ్యాన్స్ కి చేదువార్త.. ఇకపై శాశ్వతంగా ఇండియాలో సేవలు నిలిపివేత!