టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 6న రిలీజ్ కానుండగా, చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ ఒక యువకుడితో ఫ్రాంక్ వీడియో తీశాడు. అది రోడ్డు పై తీయడంతో పలు విమర్శలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రాంక్ వీడియో పై ఇవాళ ఓ ఛానెల్ లో డిబేట్ జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా స్టూడియోకు వచ్చిన హీరో… యాంకర్ తో డిబేట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ టీవీ చానల్ యాంకర్… విశ్వక్ సేన ని మానసిక రోగి అన్నట్లు సంబోదించింది. యాంకర్ అలా పిలవడంతో హీరో విశ్వక్ సేన్ కి చిర్రెత్తుకొచ్చి ‘మీరెవరు నన్ను డిప్రెస్డ్, పాగల్ అని పిలవడానికి?’ అంటూ పలు ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
యాంకర్ ఆగ్రహంతో విశ్వక్ సేన్ ని తన స్టూడియో నుంచి “గెటౌట్” అని అరవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన కెరీర్ లో ఇలాంటి మహిళను ఎప్పుడూ చూడలేదని.. ఒక మగాడికంటే శక్తివంతంగా కనిపించిందని అన్నారు. ఈ సందర్భంగా విష్వక్సేన్-టీవీ యాంకర్ ఎపిసోడ్ వీడియోను కూడా వర్మ పంచుకున్నారు.
I never saw a woman looking so much more powerful than a man 💪😍💪 @Devi_Nagavalli is no less than SARKAR 🙏🙏🙏 pic.twitter.com/QbJIMTbR0K
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022