ఎప్పుడు వివాదాల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ తీస్తానంటూ ప్రకటించారు. తన తాజా చిత్రం ‘డేంజరస్’ ప్రమోషన్ లో భాగంగా ఆర్జీవీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ బయోపిక్ ను కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తానంటూ కూడా తెలిపాడు వర్మ.
ఇది కూడ చదవండి: యాంకర్ సుమపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
ఇదిలా ఉంటే ఆయన తెరకెక్కించిన డేంజరస్ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో అప్సరాణి, నైనా గంగూలీ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ సైతం నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. ఇక దీంతో పాటు ఇటీవల విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ మూవీని చూశానని, చాలా బాగుందంటూ ఆర్జీవీ తెలిపారు. ఇక ఏపీ టికట్ల విషయంలో కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పారు రామ్ గోపాల్ వర్మ. కేసీఆర్ బయోపిక్ తీస్తానంటున్న ఆర్జీవీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.