పాన్ ఇండియా వైడ్ సినీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పీరియాడిక్ మల్టీస్టారర్ చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం.. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే RRR మూవీకి సంబంధించి ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజిలో జరిగాయి. RRR అడ్వాన్స్ బుకింగ్స్ చూసే సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.
బాహుబలి 2 ప్రీమియర్ షోలపై ఏర్పడిన బజ్ RRR పై కూడా వినిపిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు రాజమౌళి చిత్రబృందంతో, డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చించి RRR ప్రీమియర్ షోలపై కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. విడుదలకు ముందురోజే.. అంటే మార్చి 24న RRR ప్రీమియర్ రెండు షోలు(6 PM, 9 PM) ప్రదర్శించబడతాయి. ఇక మార్చి 24 లోపే అన్ని రాష్ట్రాలలో RRR ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు చేయనున్నారు.ఇండియాలో ప్రీమియర్ షోలు మాములు టైంలోనే ప్రదర్శించబడతాయి కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. త్వరలోనే RRR ప్రీమియర్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వచ్చే వారాంతంలోపు కొత్త ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. RRR ప్రమోషన్స్ కోసం వేసిన కొత్త సెట్ లో సోమవారం నుండి ప్రమోషన్స్ ప్రారంభించనున్నారట. పాన్ ఇండియా సినిమాలను ముందురోజే ప్రీమియర్ షోలు వేసేందుకు దర్శకనిర్మాతలు భయపడుతున్నారు. ఎక్కడ నెగటివ్ టాక్ తెల్లారితే కలెక్షన్స్ పై ప్రభావం దెబ్బపడే అవకాశం ఉందని జంకుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంలో డేరింగ్ స్టెప్ వేయనున్నాడు.
RRR సినిమాపై పూర్తి నమ్మకంతో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశాడట. కెరీర్ లో ప్లాప్ లేని సౌత్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి. తన సినిమాలు లేట్ గా రావచ్చు కానీ ఇండస్ట్రీ రికార్డులు సెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి రాజమౌళి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ స్థాయిలో బాక్సాఫీస్ షేక్ చేయనుందో.. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించారు. మరి RRR పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.