Rahul Ramakrishna: ఓ ప్రముఖ ఛానల్ డిబేట్‌లో హీరో విశ్వక్ సేన్, యాంకర్ దేవీ నాగవల్లిల మధ్య చోటుచేసుకున్న వివాదం విషయంలో విశ్వక్ సేన్‌కు మద్దతు పెరుగుతోంది. అన్ని వర్గాలనుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తోంది. సోషల్ మీడియానుంచి ఫ్యాన్స్‌తో పాటు ఇతర నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. ఇక, సినిమా పరిశ్రమ నుంచి నిర్మాత చిట్టిబాబు విశ్వక్ సేన్‌ది మాత్రమే తప్పు కాదని, దేవీ నాగవల్లిది కూడా తప్పు ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమనుంచి మరో వ్యక్తి విశ్వక్‌కు మద్దతుగా నిలిచారు. ప్రముఖ హాస్యనటుడు రాహుల్ రామక్రిష్ణ బుధవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ విశ్వక్ సేన్ లాంటి మంచి వ్యక్తిని అవమానపరుస్తూ నడుస్తున్న సర్కస్‌లో నేను కూడా భాగం కావాలనుకుంటున్నాను.
అతడికి నా పూర్తి మద్దతు ఉంది. ముఖ్యంగా ఆ ఛానల్ అతడిని ఎలా ట్రీట్ చేసిందన్నదాంట్లో’’ అని పేర్కొన్నారు. మరో రెండు ట్వీట్లతో ప్రముఖ ఛానల్‌పై కూడా విరుచుకుపడ్డారు. ‘‘ ఆ ఛానల్ కేవలం వార్తలను క్యాష్ చేసుకోవటానికి మాత్రమే చూస్తుంది. అలాంటి వార్తల కోసం జనం జొల్లు కార్చటం నిజంగా సిగ్గు చేటు. వార్తలు చూపించే విధానంలో ఆ ఛానల్ నీచ స్వభావం గురించి ఎవరూ మాట్లాడరు. వాళ్లు దేన్నీ పట్టించుకోరు. నాకు ఆ ఛానల్‌తో సమస్య ఉంది.. ఎందుకంటే వాళ్లు కన్‌స్ట్రక్టివ్ స్పేస్‌లో భాగం కాదు’’ అని పేర్కొన్నారు. మరి, రాహుల్ రామక్రిష్ణ ట్వీట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I’d like to be a part of the circus that is surrounding and humiliating a grounded, humble person as #VishwakSen
He has my total support especially in light of how @TV9Telugu treated him. I don’t know what they do to journalists these days..jeez..— Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022
Their news is about monetary benefits. It is just shameful that people salivate for the kind of nonsense that they mostly* perpetuate.
— Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022
ఇవి కూడా చదవండి : Chitti Babu: విశ్వక్ సేన్- యాంకర్ దేవీ నాగవల్లి గొడవపై నిర్మాత చిట్టిబాబు క్లారిటీ!