Radisson Pub Drugs Case: రాడిసన్ హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వెలుగు చూడటం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 150మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమపై మీడియాలో వస్తున్న కథనాలపై సినిమా రంగానికి చెందిన కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, పబ్‌లో ఉన్నంత మాత్రాన తమపై నిందలు వేయటం సరికాదని మీడియాను వేడుకుంటున్నారు. తాజాగా, జూనియర్ ఆర్టిస్ట్ కల్లపు కుషితా ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అందులో ‘‘ లేట్ హవర్స్ పబ్‌లో ఉండటం మా తప్పు కాదు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం మాకు తెలియదు.
తెలిస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్తాము.? అక్కడ రష్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యాక బయటకి వెళదామని అనుకునే లోపే పోలీసులు వచ్చారు. అందరిని బాధ్యులను చేయడం.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం సరికాదు. పోలీసులు వచ్చారు. మా డిటైల్స్ తీసుకున్నారు…! మేము పోలీసులకు సహకరించాము. కావాల్సి వస్తే మా రక్త నమూనాలు (శాంపిల్స్) తీసుకోండి. మేము ఎప్పుడైనా శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధమే. దీన్ని అడ్డు పెట్టుకుని ఇలా చేయడం సరికాదు. మీడియా వాళ్లు కొంచెం సమన్వయం పాటించాలి. పబ్‌కి వచ్చిన వాళ్లందర్ని బద్నామ్ చేయడం సరికాదు. మేము ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాం.!
మమ్మల్ని ఇలా బద్నామ్ చేయడం సరి కాదు..!. పబ్‌లో ఉన్నవారందరిపై ఇలా ద్రుష్పచారం చేయడం సరి కాదు…! అందరి రక్త నమూనాలు తీసుకుని ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో.. వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోండి. మేము కూడా సహకరిస్తాం. ఇలాంటి దుష్ప్రచారం వల్ల మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పబ్ అర్ధరాత్రి వరకు నడిపించే వారి పై చర్యలు తీసుకోండి. మేము జస్ట్ ఆఫర్ పార్టీకి వెళ్ళాం. దయచేసి మీడియా వారు మమ్మల్ని బద్నాం చేయకండి’’ అంటూ వేడుకున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.