ఇండస్ట్రీలో పెద్ద సినిమాల హడావిడి మళ్లీ మొదలైంది. RRR, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలన్నీ విడుదల తేదీలు ప్రకటించేసరికి ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కొత్త ఉత్సాహం మొదలైంది. ఇకనుండి వారానికి ఓ పెద్ద సినిమా చొప్పున రిలీజుకి రెడీ అవుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు రాధేశ్యామ్ మేకర్స్.
మార్చి 11న విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమా.. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎలాగో ఇప్పుడు వాలెంటైన్ వీక్ నడుస్తుంది కదా.. అని మేకర్స్ వాలంటైన్స్ రోజున ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. సౌత్ ఇండస్ట్రీలోనే మొదటిసారి ఓ థీమ్ పార్టీతో ప్రమోషన్స్ జరపనున్న సినిమాగా రాధేశ్యామ్ నిలిచిపోనుంది. ఈ స్పెషల్ ఈవెంట్ కోసం హైదరాబాద్ లోని కెమిస్ట్రీ క్లబ్‌లో ప్రత్యేకంగా సెట్ వేయనున్నారని, సెట్స్ కూడా సినిమా కథను ప్రతిబింబించేలా ఉంటాయని సమాచారం.ప్రభాస్, పూజాహెగ్డే ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చూడాలి మరి రాధేశ్యామ్ కి థీమ్ పార్టీ ఏ స్థాయిలో కలిసొస్తుందో.. మరి రాధేశ్యామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.