ఈ మధ్యకాలంలో టీవీ అందించే ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకు అదే స్థాయిలో OTT వేదికలు కూడా అందిస్తున్నాయి. అదీగాక సినీతారలే హోస్ట్ లుగా షోస్ చేస్తుండటంతో ఓటిటిలకు ఆదరణ ఓ రేంజిలో లభిస్తుంది. అయితే.. తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నటువంటి ఓటిటి ఆహా. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అనే టాక్ షో విశేషంగా ఆకట్టుకుంటోంది.
‘ఆహా’లోనే ప్రస్తుతం హైయెస్ట్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది ఈ ‘అన్ స్టాపబుల్’ షో. అయితే.. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు బాలయ్య షోలో పాల్గొన్నారు. ఇటీవలే RRR డైరెక్టర్ రాజమౌళి – మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిలు ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఇక మహేష్ బాబు ఎపిసోడ్ ఇప్పట్లో వచ్చేలా లేదని అర్థమైంది.
కానీ తాజాగా బాలయ్య బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడనే చెప్పాలి. తాజాగా ఆహా యాజమాన్యం కొత్త అప్డేట్ వదిలింది. తదుపరి వారం ‘అన్ స్టాపబుల్’ షోకి ఎవరు వస్తారా..? అనేది ఓ పోస్టర్ ద్వారా చెప్పేసింది . ఈసారి బాలయ్యతో ముచ్చటించేటందుకు ‘తగ్గేదే..లే’ అంటూ పుష్ప టీమ్ రాబోతున్నారు. తాజాగా బాలయ్య – అల్లు అర్జున్ కలిసిన ఫోటో షేర్ చేసింది ఆహా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే.. అల్లు అర్జున్ తో పాటు పుష్ప బృందం పాల్గొంటుందని సమాచారం. చూడాలి మరి పుష్ప టీం బాలయ్యతో ఎలా సందడి చేస్తారో.. మరి బాలయ్యతో పుష్ప ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.