ఇటీవలి కాలంలో చాలా మంది ప్రముఖులు పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్నప్పటికీ.. తమ తమ జీవితంలో తమను ఇష్టపడే వ్యక్తులను రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముక గాయన కనికా కపూర్ తనకు నచ్చిన ప్రియుడిని వివాహం చేసుకుంది. లండన్ లో ఉంటున్న వ్యాపారవేత్త గౌతమ్ హతిరమని ఆమె వివాహం చేసుకుంది. అయితే వివాహం నాటికి ఆమెకు ముగ్గురు సంతానం కలిగి ఉంది. కొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
బాలీవుడ్ లో సింగర్ గా రాణిస్తున్న కనికా కపూర్ కి రాజ్ చన్దోక్ తో పెళ్లయ్యింది. తర్వాత ఈ జంట లండన్ కి వెళ్లి స్థిరపడ్డారు. ఆమెకు ఆయనా, సమర, యువరాజ్ అని ముగ్గురు సంతానం కలిగారు. కొంత కాలం తర్వాత వీరి మద్య గొడవలు రావడంతో విడిపోయారు. ఆనాటి నుంచి పిల్లల బాధ్యతను కనికానే చూసుకుంటోంది. అప్పుడప్పుడు తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చిపోతూ ఉండేది.. 2020 లో ఆమె కరోనా భారిన పడ్డారు.. దాదాపు చావు అంచుల్లోకి వెళ్లి వచ్చారు.
లండన్ నుండి ఇండియా వచ్చిన కనికా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి పార్టీ ఇచ్చారు. అలాగే ఆమె రెండు మూడు పార్టీలలో పాల్గొన్నారు. ఒక సెలబ్రెటీ అయి ఉండి.. ఏమాత్రం బాధ్యత లేకుండా కరోనా సమయంలో ఇలా ప్రవర్తించడం ఏంటీ అని ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీలో ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో పాడింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.