M Ramakrishna Reddy: ప్రముఖ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు రామకృష్ణారెడ్డి మృతిపై సంతాపం తెలిపారు. కాగా, రామకృష్ణారెడ్డి 1948 మార్చి 8వ తేదీన నెల్లూరులోని గూడూరులో శ్రీమతి మస్తానమ్మ, ఎం.సుబ్బరామిరెడ్డి దంపతులకు జన్మించారు.
చదువు పూర్తిచేసుకున్న తర్వాత సిమెంట్ రేకుల బిజినెస్ చేశారు. ఆ తర్వాత బంధువుల ప్రోత్సాహంతో పరిశ్రమలోకి వచ్చారు. వైకుంఠపాళి, అల్లుడుగారు జిందాబాద్, గడుసు పిల్లోడు, మా ఊరి దేవత, అభిమానవంతులు, మూడిళ్ల ముచ్చట, సీతాపతి, అగ్ని కెరటాలు, మాయగాడు వంటి సినిమాలను నిర్మించారు.
ఇవి కూడా చదవండి : Kirak RP: జబర్దస్త్ కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ వేడుకలో సందడి చేసిన ధనరాజ్.. పిక్స్ వైరల్!