దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించే చర్చ. ఆ సినిమా దర్శకుడికి వై క్యాటగిరీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. 1980-90ల్లో కశ్మీర్ లో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాపై ప్రధాని మోదీ సైతం ప్రశంసలు కురిపించారు. ఆ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించారు. కొన్ని రాజకీయ పార్టీలు సైతం తమ కార్యకర్తలు ఈ సినిమా చూడాలంటూ పిలుపునిచ్చాయి. ఆదరణ ఎంత ఉందో వ్యతిరేకత కూడా లేకపోలేదు. కొన్నిచోట్ల నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓ సినిమా థియేటర్లో అనుకోని ఘటన వెలుగు చూసింది. ఇద్దరు యువకులు పాకిస్థాన్ కు అనుకూల నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: “ది కాశ్మీర్ ఫైల్స్” పై ప్రకాష్ రాజ్ అసంతృప్తి! గాయాలను మాన్పుతోందా ? రేపుతోందా?
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ లోని నటరాజ్ థియేటర్లో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ఆ థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఇద్దరు యువకులు పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దాంతో థియేటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ యువకులపై అక్కడున్న కొందరు ప్రేక్షకులు దాడి చేశారు. వాళ్లు అక్కడినుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ కు చేరుకుని వివరాలు సేకరించారు. నినాదాలు చేసిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు మద్యం మత్తులో ఉండి అలా నినాదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌కు ‘వై’ కేటగిరి భద్రత!
Pakistan Zindabad slogans in Telangana while kashmir files film running . In movie while Terrorists killing Hindus few peaceful in Theater proudly started chanting pakistan Zindabad. Is this what secular Telangana @KTRTRS ?
Not about k’taka Hijab do u have guts to speak on this ? pic.twitter.com/hBxazLpOOT— Telangana prid3 (@TG_CH_HYD) March 18, 2022