కేజీఎఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్, గ్రాఫ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో సినిమా చేయడానికి అన్ని ఇండస్ట్రీల సూపర్ స్టార్లు ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేశారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని చేయనున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఇక ప్రశాంత్ నీల్ తెలుగు వ్యక్తి అనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డికి స్వయన సోదరుడి కుమారుడు. ప్రశాంత్ నీల్ స్వస్థలం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం. ఆయన అసలు పేరు కూడా ప్రశాంత్ నీలకంఠాపురం. అది కాస్త.. షార్ట్‌కట్‌లో ప్రశాంత్ నీల్గా మారింది. ఇటీవలే ఆయన తండ్రి సుభాష్ రెడ్డి మృతి చెందారు. ఆయనను నీలకంఠాపురంలోనే ఖననం చేశారు. ఇక కేజీఎఫ్ 2 విడుదల రోజున కూడా ప్రశాంత్ నీల్ స్వగ్రామానికి వచ్చి.. తన తండ్రి సమాధిని దర్శించుకుని వెళ్లారు. ఆయన బంధువులంతా నీలకంఠాపురంలో ఉండటంతో.. ప్రశాంత్ నీల్ తరచూ గ్రామానికి వచ్చి వెళ్తుంటారు. ఇక తాజాగా స్వగ్రామం కోసం ప్రశాంత్ నీల్ చేసిన పనిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి ఆగస్టు 15న జన్మించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడం.. అటు తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరు నీలకంఠాపురంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్. ఈ విషయాన్ని రఘువీరా రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇందకు సంబంధించిన వీడియోని రఘువీరా రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. మరి సొంత ఊరి బాగు కోసం ప్రశాంత్ నీల్ చేస్తున్న పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. A proud&happy moment for me and to the villagers of Neelakantapuram as my nephew @prashanth_neel for his heart warming contribution of 50lakhs towards the construction of LV Prasad Eye Hospital in our Neelakantapuram on the 75th birth anniversary(15/08/1947)of his father Subhash. pic.twitter.com/UbAVtZWGnu — Dr. N Raghuveera Reddy (@drnraghuveera) August 15, 2022 ఇది కూడా చదవండి: నరేష్ మూడో భార్య రమ్య KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ఏమౌతుందో తెలుసా?… ఇది కూడా చదవండి: KGF-3లో ప్రభాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?