విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశాడు. కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ తన ఫాండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం తర్వాత సేవలను కొనసాగించేందుకు హీరో విశాల్ ముందుకు వచ్చాడు. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా ముందుకు వస్తూ పునీత్ రాజ్ కుమార్ సేవలను కొనసాగిస్తానంటూ ట్విట్టర్ లో తెలిపాడు.
ఇది కూడా చదవండి: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
నా ప్రత్యేకమైన రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందం ఉంది. పునీత్ రాజ్‌కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకేళ్లబోతున్నాను. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాను అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ప్రకాష్ రాజ్.మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
On my day today.. I’m extremely happy to announce this .. details soon
a #prakashrajfoundation initiative “let’s give back to life” pic.twitter.com/hra3HYWPtO— Prakash Raj (@prakashraaj) March 26, 2022