ప్రపంచ వ్యాప్తంగా తన గానంతో ఎంతో మంది మనసు గెల్చుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. తనకు రామ్సే హంట్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు స్వయంగా తెలిపాడు. ఈ వీడియోలో జస్టిన్ బీబర్ తన ముఖంపై ఉన్న ఇబ్బందిని చూపించాడు. అంతేకాదు పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ముఖ పక్షవాతంతో బాధపడుతున్నారు. రామ్సే హంట్ సిండ్రోమ్ అనే వ్యాధి గురయ్యారు. ఈ వార్తను స్వయంగా జస్టిన్ బీబర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. జస్టిన్ తన వీడియోలో పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో చూపించాడు. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మాట్లాడుతూ.. ‘చాలా అరుదుగా వచ్చే ఒకర రకమైన వ్యాది రామ్సే హంట్ సిండ్రోమ్ నాకు ఉంది. దాంతో నా ముఖానికి ఒక పక్క పూర్తిగా పక్షవాతం వచ్చింది. నా శరీరం సహకరించే పరిస్థితుల్లో లేదు.. నా ఎడమ కన్ను కొట్టుకోవడం లేదు, నేను ఓ పక్క సరిగా నవ్వలేకపోతున్నాను.. ప్రస్తుతం నేను మ్యూజిక్ చేసే ఆలోచనలో లేను.. నా పరిస్థితిని మీరే అర్ధం చేసుకోండి.. ఈ కారణంతోనే నా టూర్ రద్దు చేసుకుంటున్నారు.’ అంటూ తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!
ఇక జస్టిస్ బీబర్బా మంచి పాప్ సింగర్ గా పేరు సంపాదించిన విషయం తెలిసిందే. ఈయన వివిధ దేశాల్లో తన మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో భారత్ లో కూడా పర్యటించే ప్లాన్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ టూర్లు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాడు ఈ కెనడియన్ సింగర్. ప్రస్తుతం బీబర్బా కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.