టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతుంటాడని అందరికి తెలిసిందే. కానీ ఈ మధ్య సినిమా రిలీజ్ కి సమయం ఆసన్నమై ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు వివాదాలలో చిక్కుకుంటున్నాడు. గతేడాది శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటి నుండి ఆవకాయ్ సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తామంటూ చెప్పిన యూనిట్.. మొత్తానికి జూన్ 10న సినిమాను రిలీజ్ చేస్తోంది.
సెన్సిబుల్ కథలను తెరకెక్కించే యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీకూడా ప్రేక్షకులలో అంచనాలు పెంచేసాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలో ముందుగా జూన్ 8న ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు జూన్ 9న నిర్వహించనున్నట్లు సమాచారం. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతుండటం. ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా పిలవగా.. ఆయన డేట్స్ ని బట్టి జూన్ 9కి ఈవెంట్ ను వాయిదా వేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ జరగబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా పవన్ ఈ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు.
Ante…mana event ki @PawanKalyan garu vastunnaru 🤩🤩#PKforSundar ❤️#AnteSundaraniki pre release event on June 9th from 6 PM onwards 💥💥
IN CINEMAS JUNE 10 💥@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/xw2xsotzjD
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2022
ఈ సినిమాలో నానికి జతగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ లో డెబ్యూ చేయనుంది. ఈ సినిమాలో నాని ‘K.P.V.S.S.P.R సుందర ప్రసాద్’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళంలో ‘ఆదదే సుందర’, మలయాళంలో ‘ఆహా సుందర’ టైటిల్స్‌తో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.