తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితులనేది అందరికీ తెలిసిందే. అయితే పవన్ కు చాలా మంది స్నేహితులు ఉన్నా.. త్రివిక్రమ్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇంట్లో శుభాకార్యాలైన, సినిమా పరంగా చర్చించే నిర్ణయాలైన ఇద్దరు కలిసి చర్చించుకుంటారట. ఇంతటి ప్రేమగా మెలిగే త్రివిక్రమ్ పై తాజాగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హైదరాబాద్ లో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న పవన్ వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలను వివరించే ప్రయత్నం చేశాడు. తనకు త్రివిక్రమ్ మధ్య చాలా విషయాల్లో అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయని.. అయితే ఒక విషయంలో మాత్రమే తేడా వస్తుందని చెప్పారు. ఒక్క పుస్తకాల విషయంలోనే మా ఇద్దరి మధ్య తేడాలు వస్తాయి.
ఇది కూడా చదవండి: RRR సినిమాపై సుకుమార్ రియాక్షన్ వైరల్!ఇద్దరం పుస్తకాల పురుగులమే… ఏదైనా పుస్తకం చదవడం మొదలు పెడితే.. అది పూర్తి అయ్యేవరకూ వదిలి పెట్టం. ఇక నా దగ్గర ఉన్న పుస్తకాల్లో ఒకటి త్రివిక్రమ్ కు నచ్చి ఇవ్వమని అడిగితే నేను అస్సలు ఇవ్వలేదు. కావాలంటే ఒక సినిమా ఫ్రీగా అయినా చేస్తాను కానీ ఆ పుస్తకం మాత్రం ఇవ్వను అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు పవన్. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ పై పవన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.