Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో కొన్ని కలయికలు ఎప్పుడూ ఆసక్తిని రేపుతూ ఉంటాయి. టాలీవుడ్ లో మెగా-మంచు హీరోల కలయిక కూడా ఇలాంటిదే. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు మధ్య ఎన్ని స్పర్ధలు వచ్చినా.. అవేవి వారి స్నేహాన్ని చెడగొట్టలేకపోయాయి. ఈ విషయంలో సీనియర్ హీరోలు ఇద్దరు ఒకరిని మరొకరు గౌరవించుకుంటూ ముందుకి వెళ్ళినవారే. అయితే.. మా ఎన్నికల సమయంలో చెలరేగిన రచ్చ కారణంగా ఈ రెండు కుటుంబాల మధ్య కాస్త గ్యాప్ అయితే పెరిగింది అనే మాట కాదు అనలేని వాస్తవం. ఇక అప్పటి నుండి మెగా, మంచి స్టార్స్ పెద్దగా కలిసింది లేదు. అయితే.., తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మా ప్రెసిడెంట్ మంచు మనోజ్ ఒకే వేదికపై కలుసుకోవడం విశేషం. సీనియర్ హీరో అర్జున్ సార్జా దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అర్జున్ కూతురు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఐశ్వర్య- విశ్వక్ సేన్ సరసన హీరోయిన్గా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం ఉదయం రామనాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హీరో,హీరోయిన్లపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవన్, మనోజ్ లు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ సినిమాను శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ తెరకెక్కిస్తోంది. కేజీఎఫ్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. మాటలు సాయి మాధవ్ బుర్రా, పాటలు చంద్రబోస్ అందించనున్నారు. ప్రముఖ నటులు జగపతి బాబు, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. మరి, విశ్వక్ సేన్ సినిమా లాంచ్ వేదికగా.. పవన్ కల్యాణ్, మంచు విష్ణు అన్ని స్పర్ధలను మర్చిపోయి, ఇలా ఆప్యాయంగా పలకరించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి. Power⚡️ #PawanKalyan graced #VishwakSen - #Arjun film Muhurtham & Pooja Ceremony Mass ka Dass @VishwakSenActor, @aishwaryaarjun starrer @akarjunofficial directorial launched today@iVishnuManchu @srfioffl @IamJagguBhai @RaviBasrur #VishwakSen11 pic.twitter.com/Bli9DTC0Ij— SumanTV (@SumanTvOfficial) June 23, 2022 ఇవి కూడా చదవండి : Naresh: నాలుగో పెళ్లి వార్తలపై ఓపెన్ అయిన హీరో నరేష్!