RRR.. ఓ ఏడాదిన్నర కాలంగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. పీరియాడికల్ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన RRR రిలీజ్ డేట్ మార్చి 25న ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృందం రోర్ ఆఫ్ RRR పేరుతో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రాంచరణ్.. భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ మధ్య ఒక ఫన్నీ సీన్ ని జరిగింది. ప్రముఖ యూట్యూబర్ భువన్ బాం మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి చెప్పమని రామ్ చరణ్ ని అడగగా ఎన్టీఆర్ డ్రెస్ ని పొగిడేసాడు. తనకి ఒక రెడ్ కార్ పెట్ వేస్తే అందరు ఫ్లాట్ అయిపోతారు అని చిన్న కామెడీ సీన్ చేసారు. ఈ సీన్ ని కింద వీడియో లో చూడవచ్చు