నోరా ఫతేహీ బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ జూనియర్ ఎన్టీఆర్ సరసన స్టెప్పులేసింది ఈ భామ. ఆ తర్వాత బాహుబలిలో మనోహరి, కిక్ 2, లోఫర్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్– డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం హరిహర వీరమల్లులో నోరా ఫతేహీ రోష్నారా బేగం పాత్రలో నటిస్తోంది. నోరా ఫతేహీ వెండితెర మీదే కాదు.. బయట, షోలలో కూడా అంతే బోల్డ్ గా ఉంటుంది. ఎప్పుడూ ట్రెండీ అండ్ హాట్ డ్రెస్సింగ్ స్టైల్ లోనే కనిపిస్తుంటుంది.
ప్రస్తుతం ఆ డ్రెస్సింగ్ విషయంలోనే సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. నోరా ఫతేహీ బాలీవుడ్ లో కొన్ని టీవీ షోలలో కూడా తళుక్కుమంటూ ఉంటుంది. ఓ డాన్సింగ్ రియాలిటీ షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. అయితే చిన్న పిల్లలు ఉండే షోకి నోరా బోల్డ్ డ్రెస్సుల్లో వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఇటీవల మరీ బోల్డ్ గా ఉన్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెలబ్రిటీలు అంటే మంచి చెప్పేలా ఉండాలి తప్ప.. సామాన్యులు వేల్లెత్తి చూపేలా ఉండకూడదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇన్ ఫ్లుఎన్సర్స్ గా వారు ఇంకొంత మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నాం? ఎలాంటి వస్త్రధారణలో వెళ్లాలి అనే స్పృహ ఉంటాలంటూ హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం నోరా ఫతేహీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంక సినిమాల విషయానికి వస్తే.. 2015లో టెంపర్ సినిమాలో ఇట్టాగె రెచ్చిపోదాం సాంగ్ కు కేవలం రూ.10 లక్షలు పారితోషకంగా అందుకున్న నోరా ఫతేహీ.. ప్రస్తుతం ఒక్కో పాటకు రూ.2 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు చిత్రంలో మొదట జాన్వలిన్ ను అనుకోగా ఆ తర్వాత ఆమె స్థానంలో నోరా ఫతేహీని తీసుకున్నారు. చిన్న పిల్లల షోకి నోరా ఫతేహీ బోల్డ్ డ్రెస్సులో వెళ్లడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.