యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె నల్లి బొక్కల దావత్ వీడియోని తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసింది.
నెల రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోలో శివజ్యోతి రంజాన్ సందర్భంగా పిస్తా హౌస్ రెస్టారెంట్ ప్రకటించిన అన్లిమిటెడ్ బఫెట్ గురించి చెప్పింది. దీనిలో భాగంగా రెస్టారెంట్‌లోని వంటకాలను వివరిస్తూ.. మటన్ లివర్ని ఉద్దేశించి కిడ్నీ అంటుంది. కిడ్నీ అంటే.. గలీజ్‌గా ఉంటుంది అని.. లివర్ అంటారని పేర్కొంది. పక్కనే ఉన్న ఆమె భర్త.. కిడ్నీ వేరు, లివర్ వేరు అని చెప్పాడు. వీడియోలో ఈ విషయాలు గమనించిన నెటిజనులు.. శివజ్యోతిని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. కిడ్నీకి, లివర్‌కి నీకు తేడా తెల్వదా జ్యోతక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత కోడి బ్రెయిన్, లివర్ గురించి కూడా ఇలానే కామెంట్స్ చేస్తూ.. కామెడీ చేసింది శివజ్యోతి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆ వీడియో డిలీట్ చేయకపోతే.. ఏం చేయాలో అది చేస్తా: శివజ్యోతి