అషూ రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తోంది. టిక్‌టాక్ వీడియోస్‌తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 3 ఆఫర్ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్ అయిన అషూ రీసెంట్గా బిగ్‌బాస్ ఓటీటీలోనూ అడుగుపెట్టింది. అయితే ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది అషూ. ఇక అప్పటి నుంచి హాట్‌హాట్ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సహా కంటెస్టెంట్ అజయ్‌తో కలిసి మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్పై రీల్ చేసింది అషూ. ‘కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవారో తెలుసా?’ అని చెబుతుంది. ఇది కూడా చదవండి: Ashu Reddy Bold Comments: సీక్రెట్ స్మోకింగ్ పై అషు బోల్డ్ కామెంట్స్.. నేను నోరు తెరిస్తే అతనికి నష్టం! ఈ డైలాగ్ విని పక్కనే ఉన్న అజయ్ అషూ తలపై ఒకట్టిస్తాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘మీ మనసులోని మాటను కామెంట్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు రకరకాలుగా వారి మనసులో మాటను బయటపెడుతూ అషూను దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ముందు మేకప్ తీసి రీల్ చేయ్.. గుర్రాలు కాదు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు’, ‘ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్ చేయ్’, ‘నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే’ అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) ఇది కూడా చదవండి: అషురెడ్డి ఫిజిక్ పై నోరుజారిన నటరాజ్ మాస్టర్? ఇది కూడా చదవండి: అఖిల్ కి అషు భార్యలా ఉంటోంది: సరయు