Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకలో నయనతార చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎర్ర రంగులో.. ఫుల్ స్లీవ్స్‌తో ఉన్న ఆ చీర ఎంతో అద్భుతంగా ఉంది. ఆ చీరలో కొత్త పెళ్లి కూతురిగా నయనతార తళుక్కుమని మెరిసిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నయనతార పెళ్లి చీర వైరల్‌గా మారింది.
ఇందుకు కారణం లేకపోలేదు. పైకి సాధారణ ఎంబ్రైడరీతో కనిపించే ఆ చీరలో అద్భుతం దాగుంది. ఆ అద్భుతం ఎంటో తెలిస్తే వ్వావ్ అనాల్సిందే. ఇంతకీ ఆ చీర స్పెషాలిటీ ఏంటంటే.. ఫ్యాషన్ డిజైనర్లు మోనికా, కరీష్మలు ఈ చీరను ఎంతో కష్టపడి డిజైన్ చేశారు. హొయసల దేవాలయాల నిర్మాణాన్ని పోలి ఉండేలా చీరపై ఎంబ్రైడరీ వర్క్స్ వేశారు.
లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులను బ్లౌజ్ స్లీవ్స్‌పై డిజైన్ చేశారు. మొత్తం చీరలో నయన తార, విగ్నేష్ శివన్‌ల పేర్లు దాగి ఉండేలా చీరను రూపొందించారు. ఎందుకంటే?.. నిబద్ధత, ఎప్పటికీ ఆ ఇద్దరూ ఒక్కటేనని, ఒకరిపై ఒకరిపై గౌరవం ఉందని సింబాలిక్‌గా చెప్పేందుకు వారి పేర్లను ముద్రించారంట. ఈ చీర కోసం దాదాపు 13 లక్షల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. మరి, ఈ అద్భుతమైన చీరపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vignesh Shivan: తిరుమలలో అలా చేయాల్సింది కాదు. క్షమించండి! విఘ్నేశ్ శివన్ లేఖ వైరల్