లేడీ సూపర్ స్టార్ నయనతార, విగ్నేష్ శివన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అతిరథమహారధుల సమక్షంలో మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో కన్నులపండువగా సాగింది. నయన్-విగ్నేష్ పెళ్లికి.. సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ సేతుపతి, సూర్యా, హీరో కార్తీ, అట్లీ, శరత్ కుమార్ హాజరయ్యారు. ఇంక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా నూతన వధూవరులను ఆశీర్వదించాడు. అట్లీ దర్శవకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు గానీ, వీడియోలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అయితే విగ్నేష్ స్వయంగా వారి పెళ్లి ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘ఆమె నయనతార.. ఆమె జీవిత భాగస్వామిని నేనే. దేవుడి దయ, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆశీస్సులతో ఇప్పుడే నేను, నయనతార వివాహం చేసుకున్నాం’ అంటూ విగ్నేష్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వారి ఫొటోకి రేటింగ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. పదికి ఎన్ని మార్కులు ఇస్తాడు అంటూ ప్రశ్నించాడు.
On a scale of 10…
She’s Nayan & am the One ☝️☺️😍🥰
With God’s grace , the universe , all the blessings of our parents & best of friends
Jus married #Nayanthara ☺️😍🥰 #WikkiNayan #wikkinayanwedding pic.twitter.com/C7ySe17i8F
— Vignesh Shivan (@VigneshShivN) June 9, 2022
నయనతార- విగ్నేష్ వివాహంలో ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది. ఏ సెలబ్రిటీ అయినా వారి పెళ్లి ఇండస్ట్రీలోని ప్రముఖులను పిలిచి పంచభక్ష పరమాణ్నాలతో విందు భోజనం పెడతారు. కానీ, నయనతార- విగ్నేష్ లు మాత్రం వారి పెళ్లి సందర్భంగా 20 వేల మంది పిల్లలకు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నయనతార- విగ్నేష్ లకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలు తెలియజేయండి.
#WikkiNayanWedding Attendees…
Superstar, Karthi, SRK, Atlee, SJ Suriya, Sarathkumar, Vijay Sethupathy.
Lunch has been arranged for 20,000 Kids.
— Christopher Kanagaraj (@Chrissuccess) June 9, 2022