ప్రస్తుతం సౌత్ ఇండస్ర్టీలో ఏ జంట పెళ్లి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార-విఘ్నేష్ శివన్‌ల గురించే. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు ప్రేమ పావురాలు లా తిరిగిన నయన్, విఘ్నేష్ లో భార్యభర్తలు కాబోతున్నారు. జూన్ 9న వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు. ఇక ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కులం దైవం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కాబోయే భర్త విఘ్నేష్ కు నయనతార చాలా ఖరీదైన సర్ఫైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
సౌత్ ఇండియాలో లేడీ హీరోగా నయనతార మంచి గుర్తింపు సంపాందించింది. ఇండస్ర్టీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనేక మంది టాప్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు.. నిజ జీవితంలో కొన్ని ఇబ్బందులు పడింది. గతంలో కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ కారణంగా నయన చాలా డిస్టబ్ అయింది. ఈ క్రమంలో విఘ్నష్ పరిచయం కావడం.. అది కాస్తా ప్రేమకు దారితీసింది. కానీ, ఇది వరకే నయన్ ..ఖాతలో బ్రేకప్ లవ్ స్టోరీలు ఉండటంతో..ఈ ప్రేమ ఎంతవరకు నిలబడుతుందో అని అనుకున్నారంతా. కానీ, చివరికి ఆమె తన ప్రేమను నిలబెట్టుకుంది. ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడాతుంది. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా నయనతార, సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా విఘ్నేష్ శివన్ గుర్తింపు పొందిన వీరిద్దరి వివాహంపై జూన్ 9న జరగనుంది. అయితే అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని సమాచారం. టాలీవుడ్ నుండి కొందరు స్టార్ హీరోలు పెళ్లికి వెళ్లబోతున్నత్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి: ఢీ డ్యాన్స్ షోలో బూతులతో రెచ్చిపోయిన హైపర్ ఆది!
అయితే, విగ్నేశ్ తన మెడలో తాళ్లి కట్టాక నయన్ భర్తకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ రెడీ చేసిందట. దాదాపు రూ. 20 కోట్ల వ్యయంతో తాను ఇష్టంగా కట్టించుకున్న ఇళ్లుని విగ్నేశ్ కి గిఫ్ట్ గా ఇవ్వబోతుందట. అంతేకాదు, ఇద్దరు భార్య భర్తలు గా మారిన తరువాత ఆ ఇంట్లోనే కొత్త కాపురం పెట్టబోతారని సమాచారం. ఇక నయనతారకు కూడా విఘ్నేశ్ గిఫ్ట్ రెడి చేసిన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 3 కోట్లు విలువైన బంగారు ఆభరణాలను.. కాబోయే భార్య కి బహుమతిగా ఇవ్వబోతున్నాడట. అన్నింటికన్నా స్పెషల్ ఏమిటంటే..నయన్ కోసమే సపరేటు గా ఆర్డర్ చేసి..ఓ డైమెండ్ రింగ్ ను ఆమె కు లైఫ్ టైమ్ గుర్తుండిపోయేలా ఇవ్వనున్నాడట విగ్నేశ్. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.