movie news : ప్రశాంత్ అంటే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ, జీన్స్ సినిమా హీరో అని చెబితే మటుకు ప్రశాంత్‌ను ఇట్టే గుర్తుపట్టేస్తారు. సినిమా మూలాలు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి, స్టార్ డమ్ సంపాదించుకున్న కొద్దిమందిలో ఈయన ఒకరు. ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత, డైరెక్టర్ త్యాగరాజన్ కుమారుడే మన ప్రశాంత్. ‘వైఖాసి పొరంతచు’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమా పెద్ద హిట్టయింది. ఆ తర్వాత చాలా హిట్టు సినిమాల్లో నటించి స్టార్డమ్ సంపాదించుకున్నారు. అజిత్, విజయ్ హీరోలుగా నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న సమయంలో స్టార్‌గా వెలుగొందాడు.
కెరీర్ పీక్‌లో ఉండగానే.. 2005లో ప్రముఖ బిజినెస్ మ్యాన్ కూతురైన గృహలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. మనస్పర్థల కారణంగా వీరు 2008లో విడిపోయారు. ఆ తర్వాత సినిమా కెరీర్‌ను ఒకరకంగా నాశనం చేసుకున్నారు. ఇక అప్పటినుంచి ఒంటరిగానే ఉంటారు. తెలుగులో ‘వినయవిధేయ రామ’ సినిమాలో రామ్ చరణ్‌కు అన్నగా చేశారు. ప్రస్తుతం ‘‘అంధగాన్’’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆ అమ్మాయి ఎవరు?.. పెళ్లి ఎప్పుడు? అన్న విషయాలు అంధగాన్ సినిమా విడుదలైన నెల తర్వాత అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2022లో ప్రశాంత్ కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటారని సమాచారం.ఇవి కూడా చదవండి : థియేటర్ వద్ద పెట్రోల్ పోసుకుని యన్టీఆర్ అభిమాని ఆత్మహత్యయత్నం!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.