Movie News : ప్రముఖ టాలీవుడ్(బెంగాలీ) నటుడు అభిషేక్ చటర్జీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 57 ఏళ్ల వయసులో ఈ ఉదయం(గురువారం) తుదిశ్వాస విడిచారు. అయితే, అభిషేక్ మరణానికి సంబంధించిన సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అభిషేక్ 1986లో వచ్చిన పత్భోలా చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు తరుణ్ ముజుందార్ దర్శకత్వం వహించారు. సీనియర్లతో అందరితోనూ ఈయన సినిమాలు చేశారు.
సంధ్యరాయ్, ప్రొసోన్జి, తాపస్ పాల్, ఉత్పల్ దత్‌లతో కలిసి నటించారు. ఓరో చర్జోన్, తుమి కోటో సుందర్, సురర్ ఆకాశే, తుఫాన్, మర్యాద, అమర్ ప్రేమ్, పాపి, హర్నర్ జాత్ జామై, జీవన్ ప్రదీప్, పురుషోత్తం అభిర్వాద్, మేయర్ అంచల్, అర్జున్ అమర్ నామ్, సాబూజీ సాతి వంటి సూపర్ హిట్ చిత్రాలతో పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. పలు టెలివిజన్ షోలలోనూ అభిషేక్ నటించారు.ఇవి కూడా చదవండి : కొత్త షో కోసం శ్రీముఖి గ్లామరస్ లుక్.. ఫోటోస్ వైరల్!