కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డైలాగులు, పంచ్‌లు, యాక్షన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అరిస్తే సరుస్తా.. కరుస్తా.. కరిస్తే సరుస్తా అంటూ వచ్చే డైలాగులు కేవలం ఆనకు మాత్రమే సెట్ అవుతాయేమో అనిపిస్తుంది. ఒక్క నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు సేవ చేశారు. విద్యానికేతన్ స్థాపించి ఏటా పేద విద్యార్థులకు ఉచిత విద్యను కూడా అందిస్తున్నారు. ఇండస్ట్రీలో కళాకారులు, కార్మికులకు సైతం ఆయనకు తోచినంత సాయం చేస్తుంటారు. అయితే చాలా కాలం నటనకు దూరంగా ఉన్న మోహన్ బాబు ఇటీవల సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మంచు విష్ణు సినిమా నిర్మతగా, మోహన్ బాబు హీరోగా సన్ ఆఫ్ ఇండియా తెరకెక్కించారు.
అయితే ఆ సినిమా రిలీజ్ సమయంలో ఎన్ని ట్రోల్స్ ఎదుర్కొందో అందరూ చూశారు. సినిమా నిర్మాణం, సాంగ్ విషయంలోనూ విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ సమయంలో ట్రోలింగ్ పై మోహన్ బాబు ఫ్యామిలీ సీరియస్ అయ్యి.. పరువునష్టం దావా వేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడంతో ట్రోలింగ్ ఆగింది. థియేటర్ పరంగా మాత్రం ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని మాత్రం ప్రేక్షకులు ఎదురుచూశారు. అయితే ఇప్పుడు ఆ ఎదురుచూపులకు తెర పడినట్లైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సన్ ఆఫ్ ఇండియా స్ట్రీమింగ్ అవుతోంది. దేశభక్తి ప్రధానంగా డైరెక్టర్ డైమండ్ రత్నబాబు తెరకెక్కించాడు. సన్ ఆఫ్ ఇండియా సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.