దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. సినిమా ద్వారా యంగ్ టైగర్ యన్టీఆర్, రామ్ చరణ్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాందించారు. దీంతో బాలీవుడ్ లోనూ వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. RRR సినిమాలో రామ్ చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రను చూసి నార్త్ ఆడియెన్స్ అందరూ కూడా నిజంగానే రాముడు అనే తరహాలో ఊహించుకున్నారు. రామ్ చరణ్ తో నటించాలని బాలీవుడ్ హీరోయిన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మాజీ విశ్వసుందరి కూడా రామ్ చరణ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మాజీ మిస్ వరల్డ్ మనుషి చిల్లర్ అక్షయ్ కుమార్ ప్తుథ్వీ రాజ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఇలా స్టార్ హీరోల పై తన అభిమానాన్ని చాటుకుంది. ఈక్రమంలో ఈ అమ్మడు రామ్ చరణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఏ స్టార్ హీరోతో డేట్ కి వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు మనుషి చిల్లర్ చాలా స్వీట్ గా సమాధానం చెప్పింది. నిజంగా ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అంటూ.. ఎందుకంటే తాను ఎక్కువగా రామ్ చరణ్ ను ఇష్టపడతానని అయితే అతనికి మాత్రం పెళ్లి జరిగిపోయింది.
ఇదీ చదవండి: అలాంటి అబ్బాయిలే ఇష్టమంటూ రెచ్చిపోయిన సురేఖా వాణి! వీడియో వైరల్..
కాబట్టి ఇప్పుడా అవకాశం లేదు అని సమాధానం ఇచ్చింది. ఇక తన మనసులో ఉన్న డేట్ అయితే అతనితో అవకాశం వస్తే ఏదైనా మూవీకి లేదా డిన్నర్ కు వెళ్తాను అంటూ మనిషి మరో సారి తన అభిమానాన్ని చాటుకుంది. ఇక భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా రామ్ చరణ్ తో నటిస్తానని కూడా ఈ అమ్మడు తెలిపింది. మరి.. మనుషి చిల్లర్ రామ్ చరణ్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.