Memes Viral On Vijay Devarakonda Latest Photo From Liger: ఇది సోషల్ మీడియా యుగం. మంచైనా, చెడైనా నిమిషాల్లో వైరలవుతుంది. ఇక సెలబ్రిటీలు చేసే పనుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ట్వీట్, పోస్ట్‌తో సంచలనం సృష్టించగలరు. ఇదుగో ఇదే పని చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఒకే ఒక్క ఫోటోతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాను నటిస్తున్న లైగర్ సినిమా ప్రమోషన్ కోసం విజయ్ భారీ సాహసం చేశాడనే చెప్పవచ్చు. ఒంటి మీద నూలు పోగు లేకుండా.. కేవలం బొకే అడ్డం పెట్టుకుని.. వదిలిన న్యూడ్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా ప్రచారం కోసం విడుదల చేసిన ఈ స్టిల్ ప్రస్తుతం నెట్టింట రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు దీని గురించే చర్చించుకుంటున్నారు. కొంతమంది డేరింగ్ స్టెప్ అంటే.. మరి కొందరు నెగిటీవ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోపై నెట్టింట ఓ రేంజ్లో మీమ్స్ వైరలవుతున్నాయి. 'లైగర్' సినిమాలో కొత్త పోస్టర్ విడుదలైన వెంటనే ఇది సెక్సీయెస్ట్ పోస్టర్ అని కొంత మంది ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్లో 'సెక్సీయెస్ట్ పోస్టర్ ఎవర్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక మీమ్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. 'బ్రో, ఆ బొకే ఎవరికీ ఇవ్వకు' అంటూ ఒకరు... విజయ్ దేవరకొండకు బాలకృష్ణ శాలువా కప్పుతున్నట్టు ఇంకొకరు... ఒకటి కాదు, పదుల సంఖ్యలో మీమ్స్ వైరలవుతున్నాయి. వీటిపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Liger: విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా? ఇది కూడా చదవండి: Anushka Shetty: విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్.. అనుష్క శెట్టి నాటీ కామెంట్స్ వైరల్! View this post on Instagram A post shared by Telugu Swaggers (@telugu_swaggers) View this post on Instagram A post shared by Jambal Heart Raja (@jambalheartraja) View this post on Instagram A post shared by CHINNA BASHA MEMES (@chinna._basha) View this post on Instagram A post shared by Rarandoi_navukundhuam_kasepu (@rod_rambola_) View this post on Instagram A post shared by adhe_magicu_ (@adhe_magicu__) View this post on Instagram A post shared by Be Like Shiva (@belikeshiva)