‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన మరో మెగా హీరో వరుణ్ తేజ్. తన నటనతో ప్రత్యేక మైన ఫ్యాన్ పాలోయింగ్ సంపాందించాడు ఈ మెగా ప్రిన్స్. తాజాగా వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ నేపథ్యలో తెరకెక్కిన చిత్రం ‘గని’ విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్య్వూల్లో పాల్గొన్న వరుణ్ తేజ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. గని చిత్రంలో పాటు, తన పెళ్లి సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్నారు.
వరణ్ తేజ్ నటించిన ఎఫ్-2, గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలు ఎంత విజయం సాధించాయో అందరికి తెలిసిందే. వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న ఈ మెగా ప్రిన్స్ .. ‘గని’ సినిమాతో తన ఖాతాలో మరో విజయం సొంత చేసుకుంటాడని అందరు ఎదురు చూస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రీరిలీజ్ వేడుకుల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. అలా ఓ కార్యక్రమంలో పాల్గొన్న వరణ్ తేజ్ గని చిత్ర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నాగబాబు.. ఫ్యాన్స్‌తో ముచ్చటించే #AskNagababu పై ఓపెన్ అయ్యారు వరుణ్. మీరు కూడా నాగబాబుకి కొడుకులా కాకుండా.. ఓ మెగా అభిమానిలా ప్రశ్న అడగాలి అనుకుంటే ఏం అడుగుతారు అని యాంకర్ ప్రశ్నించడంతో వరుణ్ తేజ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
“ఇంతకు ముందు అయితే చాలా ప్రశ్నలు ఉండేవి.. కానీ ఇప్పుడేం లేవు. ఎందుకు అంటే నాన్నని ఇంతకు ముందు ఏదైనా అడగాలి అంటే భయంగా ఉండేది.. ఏమంటారో.. ఎలా రియాక్ట్ అవుతారో.. తిడతారేమో అని భయం ఉండేది. కానీ ఇప్పుడు మేం ఫ్రెండ్స్‌గా ఉంటున్నాం. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నాం. ఫ్యాన్స్ నా పెళ్లి గురించి నాన్నని తరుచు అడుగుతుంటారు. అయితే నాన్న మాత్రం పెళ్లి గురించి మాత్రం వరుణ్ నే అడగండి అని సమాధానం చెప్తున్నారు. నాపై నమ్మకం వచ్చిన తరువాతే నిర్ణయం నాకు వదిలేస్తున్నారు. సినిమాలనే కాదు ప్రతి విషయాన్ని నాకు వదిలేస్తున్నారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన యాక్సెప్ట్ చేస్తారు. నేను సరైన నిర్ణయం తీసుకుంటాననేది ఆయన నమ్మకం’ అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.