మీరా చోప్రా.. ఒకప్పుడు టాలీవుడ్‌లో అడపాదడపా సినిమాల్లో కనిపించింది. తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఆమెకు- ఎన్టీఆర్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఎందుకంటే మీరాచోప్రాకు ఓసారి ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఆ కక్షతోనే ఏమో ఎన్టీఆర్ అనగానే.. నెగెటివ్ గా రెస్పాండ్ అవుతుంటుంది. రెండేళ్ల క్రితం అయితే ఎన్టీఆర్ పై ఆమె చేసిన వివాదాస్పద ట్వీట్ తో ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి మీరాచోప్రాను టార్గెట్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చకు ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత కాస్త మీరా చోప్రా ఎన్టీఆర్ జోలికి రాకుండా ఊరుకుంది. కానీ, మళ్లీ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి ఎప్పుడో చెప్పేసిన తమన్నా!
ప్రస్తుతం సోషల్ మీడియాలో మీరా చోప్రా ట్వీట్ పెద్ద వివాదానికి తెరలేపింది. సౌత్ హీరోలు పాన్ ఇండియా స్థాయి గుర్తింపు అంటూ చేసిన ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు లేదు. మళ్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దక్షిణాది హీరోలు దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. వారి ట్యాలెంట్ ని చూసి అందరూ నేర్చుకోవాలి. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యష్ గర్వంగా ఉంది’ అంటూ మీరా చోప్రా ట్వీట్ చేసింది. దానిలో ఎన్టీఆర్ పేరు లేకపోవడాన్ని ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొందరు మీరా చోప్రాకి కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. మీరా చోప్రా ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I feel so happy to see South indian actors getting pan india recognition. One should learn from their talent, their humility, their passion.#prabhas #alluarjun #ramcharan #yash.
So proud 👏👏👏👏— meera chopra (@MeerraChopra) April 9, 2022
BOLLYWOOD Superstar Deepika
About Jr. NTR .Character Artist kuda paniki rani Vallaki attention Evvakandi 🤭🤭 pic.twitter.com/Opc2taw7w9
— …… 🐐 (@SK_Tarock) April 9, 2022
If you’re adding Ramcharan into the list .. You’ve to add NTR for sure .. They both had done an equal job in RRR
— 𝐈𝐜𝐨𝐧 (@Distinguisher18) April 9, 2022