మన నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుందని అంటుంటారు.. కొంత మంది నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. రచ్చ చేస్తుంటారు. మరాఠీ ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనే జరిగింది. దేశంలో ముఖ్య నేతగా పేరు తెచ్చకున్న ఎన్సీపీ అధినేత శరత్ పవార్ పై నటి కేతకి చితాలే సోషల్ మీడియా వేధికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేరంపై ఆమె పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇటు రాజకీయాలు, అటు సినీ ఇండస్ట్రీలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..
కేతకి చితాలే ఈ మద్య ఫేస్ బుక్ లో శరత్ పవర్ ఇంటిపేరుతో పాటు ఆయన వయసును ప్రస్తావి ఒక కామెంట్ చేసింది. అయితే ఆ కామెంట్ లో ఆయన ఇంటిపేరు పవర్ అని మాత్రమే ప్రస్తావించిన ఆమె ఆయన వయస్సు 80 ఏళ్లు అంటూ రాసుకొచ్చింది. తమ అధ్యక్షుడిని అవమానించే విధంగా పోస్ట్ చేసిందని కేతకి చితాలే పై స్వప్నిల్ నెట్కే అనే వ్యక్తి ఠాణెలోని కల్వా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను థానే పోలీసులు ముంబాయిలో అరెస్ట్ చేశారు.
ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరత్ పవార్ విలేకరులు అడుగగా.. తనకు ఏమీ తెలియదని.. అసలు ఆ నటి ఎవరు, ఆమె బ్యాగ్ గ్రౌండ్ ఏంటీ అన్న విషయం తనకు ఏమాత్రం తెలియదని చెప్పుకొచ్చారు. తనకు తెలియని విషయంపై కామెంట్ చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. నటి కేతకి పై పూణెలోనూ ఎన్సీపీ కార్యకర్త ఫిర్యాదుతో కేతకిపై కేసు నమోదైంది.