Vishnu Manchu: సినీ పరిశ్రమనుంచి విశ్వక్ సేన్‌కు మద్దుతుగా నిలిచే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మీడియా డిబేట్‌లో వివాదం విషయంలో నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. కొందరు ఇన్‌డైరెక్ట్‌గా విశ్వక్‌ను సపోర్ట్ చేస్తున్నారు. మంచు విష్ణు విశ్వక్ సేన్‌కి శుభాకాంక్షలు చెబుతూ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ‘‘ నా తమ్ముడు విశ్వక్ సేన్‌కు శుభాకాంక్షలు. ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. అంతకు క్రితం సాయిధరమ్ తేజ్, డీజే తిల్లు ఫేమ్ సిద్దు జొన్నల గడ్డలు కూడా విశ్వక్ సేన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సాయిధరమ్ తేజ్ తన ట్వీట్‌లో… ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా వినోదం, భావోద్వేగాల కలయికగా ఉంది. నాకు బాగా కనెక్ట్ అయింది. ఎంజాయ్ చేశా. అర్జున్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. బాపినీడు అన్న, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రుక్సార్ థిల్లాన్, సినిమా టీంకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ తన ట్వీట్‌లో.. ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు నా ముఖంలో నవ్వు చెదరలేదు. రచన, నటన అద్భుతంగా ఉంది. సినిమా చాలా క్యూట్‌గా ఉంది. టీం అందరికీ శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. కాగా, విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమాకు విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల మందుకు రానుంది. మరి, మంచు విష్ణు ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wishing my brother #ViswakSen all the best for #AshokaVanamLoArjunaKalyanam God Speed.
— Vishnu Manchu (@iVishnuManchu) May 5, 2022
ఇవి కూడా చదవండి : Vishwak Sen: రెండేళ్లలో బాలీవుడ్‌లో అడుగుపెడతా: విశ్వక్ సేన్