ఈ మధ్యకాలంలో తెలుగు హీరోల్లో మెజారిటీ యంగ్ స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. బాహుబలి తో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగాయి. ఇదే క్రమంలో ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అనంతరం ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, RRR సినిమాతో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. వీరితో పాటు మరికొందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్టు కూడా పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుోంది.
డైనమిక్ స్టార్, యువ కథానాయకుడు విష్ణు మంచు పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశారు. మంచు విష్ణు.. గాలి నాగేశ్వరరావు పాత్రలో ఆయన VM19 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఆ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా దానికి సంబంధించిన విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడిాయలో షేర్ చేశారు. జూన్ 10న ఉదయం 09.32 గంటలకు టైటిల్ వెల్లడించనున్నారు. విష్ణు మంచి 19వ చిత్రమిది. మంచు విష్ణుకు 19వ చిత్రమిది. కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరం భక్త మంచు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. VM19 సినిమాలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్పుత్, రేణుక పాత్రలో సన్నీ లియోన్ నటిస్తున్నారు.
ఇదీ చదవండి: సినిమాల్లోకి నమ్రత రీఎంట్రీ అంటూ వార్తలు.. ఆమె ఏమన్నారంటే..?
Ee okka roju wait chey Swathi
Repu 9:32AM andariki chepeddam. 🫣 🫣 https://t.co/m4kslx458u pic.twitter.com/BhhbJSqobz— Vishnu Manchu (@iVishnuManchu) June 9, 2022
దర్శకుడు జి. నాగేశ్వరరరెడ్డి మూల కథ అందించనున్నట్లు టాక్. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మరి.. మంచు విష్టు హీరోగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.