మా ప్రెసిడెంట్ గా పదవీ చేపట్టినప్పటి నుండి మంచు విష్ణు రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మా అసోసియేషన్ సభ్యుల కోసం ఆయన మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో ‘మా’ సభ్యులు కోసం ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హెల్త్ చెకప్ ద్వారా మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్ తో పాటుగా పది రకాల హెల్త్ చెకప్‌లు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. “మా సభ్యులకు ఏఐజీ వారు ఉచితంగా హెల్త్ చెకప్స్ చేశారు. అలాగే సెవన్ స్టార్ ఫెసిలిటీస్ తో మా అసోసియేషన్ కు ఒక్క రూపాయి ఛార్జ్ చేయకుండా సేవలందించారు. ఏఐజీ డాక్టర్స్ అందరికీ కూడా చాలా థాంక్స్. 4 సంవత్సరాల క్రితం.. సింగపూర్ లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మాస్టర్ చెకప్ కోసం సింగపూర్ వెళ్తే ఇండియాలో ఏఐజీ పెట్టుకొని ఇక్కడిదాకా ఎందుకు వచ్చారు అని అక్కడి డాక్టర్స్ మమ్మల్ని అడిగారు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి అంత పేరుంది.
అలాంటి హాస్పిటల్ లో మా సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ అందిస్తుండం సంతోషం. ఈ క్యాంప్ వల్ల మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు” అని చెప్పుకొచ్చారు. ఇక మంచు విష్ణు మా అధ్యక్షుడు అయ్యాక హెల్త్ కి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని నటుడు నరేష్ మాట్లాడారు. చివరిగా ఏఐజీ డైరక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చాలా మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్‌లు వేసుకొని షూటింగ్ చేయొచ్చా అని అడిగేవారు. చాలా కష్టపడుతున్నారు. మూవీ ఆర్టిస్టుల లైఫ్ స్టైల్ కారణంగా వారికీ లంగ్స్ వ్యాధి, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. మరి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.