మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మికి యాక్సిండెంట్ అయినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. మంచు లక్ష్మి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేతివేళ్లు, మోకాలికి దెబ్బలు తగిలి అల్లాడిపోతూ.. పోస్టు చేశారు. దీంతో అభిమానులు అసలు మంచు లక్ష్మీకి ఏమైందంటూ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఫ్యాన్స్ నుంచి వరుసగా మెసేజ్‌లు వస్తుండటంతో జరిగిన విషయాన్ని వివరించారు లక్ష్మి. తన షుటింగ్‌లో చిన్నపాటి గాయాలు అయినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మంచు లక్ష్మి మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షుటింగ్ సందర్భంగా ఓ ఫైట్ సీన్ కోసం తీసిన మేకప్‌ను మంచు లక్ష్మి తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. మరి ఇలాంటి పోస్టులతో అభిమానులను ఆందోళనకు గురిచేసిన మంచు లక్ష్మిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.