సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదలై సౌత్ ఇండియన్ రికార్డులను షేక్ చేసింది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వ్యూస్ పరంగానూ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
ఇక సర్కారు వారి పాట ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఊహించని స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకొని నెం.1 గా నిలిచింది. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. యూట్యూబ్ వేదికగా ‘సర్కారు వారి పాట ట్రైలర్’కి 24 గంటల్లో 27 మిలియన్ల వ్యూస్.. 1.22 మిలియన్ల లైక్స్ రాగా.. ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలోనే హైయెస్ట్ వ్యూస్ దక్కించుకున్న ఫస్ట్ మూవీగా నిలవడం విశేషం.
ఈ సినిమా ట్రైలర్ తర్వాత 2వ స్థానంలో రాధే శ్యామ్(23.1 మిలియన్స్), 3వ స్థానంలో RRR(21.8 మిలియన్స్) సినిమాలు నిలిచాయి. ఇక ఈ ట్రైలర్ లో మహేష్ బాబు స్టైలిష్ లుక్, స్వాగ్, మాసివ్ డైలాగ్ డెలివరీ, ఇంటెన్సిటీ యాక్షన్ లకు తోడు కీర్తి సురేష్ గ్లామర్.. వెరసీ “సర్కారు వారి పాట” మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బ్యాంకు మేనేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇక ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సర్కారు సాంగ్స్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్ – తమన్ కాంబినేషన్ లో ఇది 4వ సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీస్, 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. మరి మే 12న మహేష్ మాస్ జాతర.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.