సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా రాణిస్తూ.. నేడు సూపర్ స్టార్ రేంజ్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు క్యూ కడుతుంటారు. మహేష్ తో ఒక్క సినిమా చేయడం కోసం ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి అయినా సిద్ధపడుతున్నారు. ఇక మహేష్ బాబును బాలీవుడ్‌లో సినిమాల్లో నటింపచేయాలని ఇప్పటికే చాలా మంది ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం.. టాలీవుడ్‌ని విడిచి పెట్టి వెళ్లలేదు. ఈ క్రమంలో తాజగా సర్కారు వారి పాట ప్రమోషన్స్ సందర్భంగా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై మరోసారి స్పందించారు. బీటౌన్ నిర్మాతలు తనను భరించలేరని కామెంట్ చేశారు. ప్రస్తుతం మహేష్ వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతుంది. అంతేకాక.. ఆయన రెమ్యునరేషన్ ఎంత? ఆస్తుల విలువ ఎంత.. అయన కెరీర్, సంపాదన,వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక మహేష్ రెమ్యునరేషన్ అంత భారీగా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Pokiri-2: పోకిరి-2 పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు.. వీడియో వైరల్!
ప్రస్తుతం సౌత్‌లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఆయనతో ఓ సినిమా తీయాలంటే.. కోట్లు ఇచ్చుకోవాలి. రిపోర్ట్ ప్రకారం, మహేష్ బాబు ఒక్కో సినిమాకి 55 నుండి 65 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అదే విధంగా ఒక ప్రకటన కోసం కూడా ఆయన కోట్లలోనే రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ప్రస్తుతం మహేష్ మేకర్స్ నుండి 80 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ ప్రకారం.. మహేష్ బాబు ఆస్తి 32 మిలియన్ డాలర్లు అంటే అక్షరాలు రూ. 244 కోట్లు. అతని సంపాదనలో ఎక్కువ భాగం సినిమాలు, ప్రకటనల నుంచి వచ్చిందే.
ఇది కూడా చదవండి: Mahesh Babu: మహేష్ వ్యాఖ్యలపై బాలీవుడ్ లో దుమారం.. క్లారిటీ ఇచ్చిన టీమ్!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మహేష్ బాబు నిర్మించుకున్న విలాసవంతమైన బంగ్లా ధర దాదాపు 30 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది. అంతే కాకుండా బెంగుళూరులో కూడా కొన్ని కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొన్నాడు. ఈ ఇళ్లలో జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్ సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మహేష్ బాబుకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. అతని వద్ద లాంబోర్గినీ గల్లార్డో ఉంది, దాని విలువ రూ. 3 కోట్లు. ఇది కాకుండా, టయోటా ల్యాండ్ క్రూయిజర్ విలువ 90 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ 49 లక్షలు మరియు రేంజ్ రోవర్ వోగ్ 2 కోట్లు, ఆడి ఎ8 1.12 కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి. మహేష్ బాబు గురించి ఎవరికి తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన సినిమాల షూటింగ్ సమయంలో ఉపయోగించే వ్యానిటీ వ్యాన్ కూడా చాలా ఖరీదైనదే. రిపోర్ట్స్ ప్రకారం.. దీని విలువ 6 కోట్ల రూపాయలని.. ఇందులో చాలా సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం. ఈ వ్యానిటీ వ్యాన్‌లు బాత్రూమ్, టీవీ, స్టైలిష్ సిట్టింగ్ ఏరియా, కిచెన్ మరెన్నో సౌకర్యాలు ఉన్నాయట. మరి మహేష్ బాబు తీసుకునే ఈ భారీ రెమ్యూనరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Mahesh Babu: ‘ద పీకాక్’ కవర్‌పేజీపై స్టైలిష్ లుక్ తో మహేశ్ బాబు..!