తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన కామెడీ, యాక్షన్, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ లో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం విడుదలకు రెడీ అవుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ మొదటిసారి నటించింది. ఈ క్రమంలో ఇటీవల చిత్రబృందం హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్ లో ట్రైలర్ లాంచ్ నిర్వహించింది. ట్రైలర్ లాంచ్ సందర్బంగా థియేటర్ వద్దకు మహేష్ బాబు ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ చూపించిన అభిమానంపై, ట్రైలర్ లాంచ్ కి భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలిరావడం పై మహేష్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. ‘ఒక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఇంతమంది ఫ్యాన్స్ రావడం చూసి షాకయ్యాను. నాపై ఇంత అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్ కి హ్యాట్సాఫ్. మీరు చూపిస్తున్న అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.