సితార ఘట్టమనేని.. తెలుసు కదా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కుమార్తె. ఆట, పాటల్లోనే కాదు.. సోషల్ మీడియాలోను సితార చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అన్న గౌతమ్ తో పాటు, కుటుంబానికి సంబందించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది సితార. కొద్ది రోజులుగా సితారా డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోస్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటుంది. ఇక ఇటీవల మహేష్ బాబు నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ లో మెరిసింది సితార. ఆమె స్టెప్పులకు మహేష్ బాబు మాత్రమే కాకుండా..వారి అభిమానులు ముగ్దులయ్యారు. తాజాగా సితార చేసిన కూచిపూడి నృత్యం చూసి.. మహేష్ బాబు మరోసారి మురిసిపోయారు. సితార చేసిన ఈ నృత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీరామనవమి సందర్భంగా .. సితార కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించింది. ఆ నృత్యాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా షేర్ చేశారు. “సితార మొట్టమొదటి కూచిపూడి డ్యాన్స్. ఈ శుభప్రదమైన శ్రీరామనవవమి రోజున ప్రదర్శించడం కంటే సంతోషం ఏముంటుంది?. సితార అంకింతభావం ఆశ్చర్యం కలిగిస్తోంది. నన్ను మరింత గర్వించేలా చేసింది. సితార ఈ అద్భుతమైన డ్యాన్స్ చేసేలా చేసిన గురువులు అరుణ బిక్షు, మహతి బిక్షు గార్లుకు ధన్యవాదాలు” అంటూ సితార నృత్యం వీడియోను మహేశ్ బాబు షేర్ చేశారు. సితార డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి.. సితార చేసిన కూచిపూడి నృత్యం మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.