‘కోవై సరళ’.. ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలా వచ్చేస్తోంది కదూ..! ఆమె మాట, ఆమె ముఖం కలలముందు కదలాడుతూ ఉంటుంది. హాస్య నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు కోవై సరళ. తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకున్నారామె. కామెడీకి బ్రహ్మానందం కింగ్ అయితే.. కోవై సరళ క్వీన్ అనే చెప్పాలి. అయితే.. గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. 2019లో వచ్చిన `అభినేత్రి 2` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె కొంత విరామం తరువాత తమిళ చిత్రం ‘సెంబి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఆమె సరికొత్త మేకోవర్ తో ఎవరూ గుర్తు పట్టలేని విధంగా కనిపించబోతోంది.
విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అశ్విన్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తుండగా..కోవై సరళ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా మేకర్స్ ‘సెంబి’ చిత్రానికి సంబంధించి స్టన్నింగ్ పోస్టర్‌ను అందరితో పంచుకున్నారు. 70 ఏళ్లకు పైబడిన వృద్దురాలిగా స్కార్ప్లో సీరియస్ షేడ్స్ తో ఉన్న కోవై సరళ.. ఓ అమ్మాయిని హత్తుకొని ఉన్న ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ‘సెంబి’.. ఓ బస్ జర్నీ నేపథ్యంలో సాగే చిత్రమిది. కొంత మంది పాసింజర్స్ కోడైకెనాల్ టు దిండిగల్ ట్రావెలింగ్ కోసం ఓ బస్ లో ప్రయాణం మొదలు పెడతారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలు సంఘటనల సమాహారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీ తెలుగులో అదే టైటిల్‌తో థియేటర్లలో సందడి చేయనుంది.
Presenting the Title and First Look of my next titled #SEMBI #செம்பி starring #KovaiSarala @i_amak prod by #Ravindran‘s @tridentartsoffl & #AjmalKhan @actressReyaa‘s @AREntertainoffl #Jeevan @nivaskprasanna #Buvan #VijayThennarasu @PhoenixPrabu2 @srikrish_dance @onlynikil pic.twitter.com/BCO7eACqYP
— Prabu Solomon (@prabu_solomon) May 20, 2022
ప్రభు సాల్మన్.. దగ్గుబాటి రానా హీరోగా `అరణ్య` పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాణించలేకపోయింది. హీరోగా రానాకు.. దర్శకుడిగా ప్రభు సాల్మన్ కు.. ఏ విషయంలోనూ ఈ సినిమా పేరు తీసుకురాకపోగా భారీ ప్లాప్ గా నిలిచింది. మరి కోవై సరళ లుక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: ఖరీదైన కారు కొనగోలు చేసి కంగనా రౌనత్!