తన సాహిత్యంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తించేలా చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భౌతికంగా దూరమైనా.. ఆయన రాసిన పాటల రూపంలో మన మధ్యే ఉన్నారనే భావన కలుగుతుంది. ఆయన రాసిన ఆఖరి పాట శ్యామ్ సింఘరాయ్ సినిమాలోని ‘నెలరాజుని ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’. ఈ పాటను సరిగమప కార్యక్రమంలో సింగర్ అభినవ్ ఆలపించాడు. ఆ సందర్భంగా ఛానల్ వాళ్లు ఓ స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలో సిరివెన్నెల చిత్రపటానికి అందరూ పూలు జల్లి నివాళులర్పించారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి అయితే సిరివెన్నెల చిత్రపటాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఆ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.