ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘కేజీఎఫ్’ సినిమా టాపిక్ వినిపిస్తోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాసివ్ సక్సెస్ అందుకొని దూసుకుపోతుంది. ఈ సినిమాలోని అన్ని పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా రాకీ తల్లి పాత్రకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.
అందుకే సినిమా చూసే టైంలో అందులోని మెయిన్ ఎమోషన్ ని ఫీల్ అవ్వగలుగుతున్నారు. అయితే.. రాకీని చివరివరకు వెనకుండి నడిపించిన తల్లి పాత్రను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. కేజీఎఫ్ లో రాకీకి తల్లిగా కన్నడ యంగ్ ఆర్టిస్ట్ అర్చన జోయిస్ నటించింది. కేజీఎఫ్ కి ముందు వరకు అర్చన గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ ఎప్పుడైతే కేజీఎఫ్ రిలీజ్ అయ్యిందో.. అప్పటినుండి ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఇక కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో అర్చన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ర్యాపిడ్ రౌండ్ లో అర్చనను తెలుగు స్టార్ హీరోల గురించి అడిగిన ప్రశ్నకు ఆమె చాలా ఉత్సాహంగా జవాబులు చెప్పింది. ప్రస్తుతం అర్చన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్: ఫైర్
జూనియర్ ఎన్టీఆర్: చాలా జెన్యూన్. పవర్ ఫుల్ యాక్టర్ కానీ నాకు ఆర్ఆర్ఆర్ లో చాలా క్యూట్‌గా కనిపించాడు.
ప్రభాస్: స్ట్రెంథ్.. ‘సలార్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను ప్రభాస్ హార్డ్ వర్క్ ని చూశాను. ప్రశాంత్ నీల్ సార్, ప్రభాస్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.
మహేష్ బాబు: చాలా అందగాడు. అతనికి పెళ్లయిందని, పిల్లలు ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. అస్సలు అలా కనిపించడు.
పవన్ కళ్యాణ్: డాన్స్.. ఆయనకు కర్ణాటకలో చాలా మంది అభిమానులు ఉన్నారు.