కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్-2’. ఏప్రిల్ 14న(గురువారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కేజీఎఫ్-2 సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది.
సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజులపాటు (ఏప్రిల్ 14 – ఏప్రిల్ 18) వరకూ టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ స్క్రీన్లు, ఐమాక్స్, సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఒక్కో టికెట్ మీద రూ. 50 వరకు.. ఎయిర్ కండిషన్, ఎయిర్ కూల్ థియేటర్లలో ఒక్కో టికెట్ మీద రూ. 30 చొప్పున రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే నాన్ ఏసీ థియేటర్లలో ఎటువంటి మార్పులూ లేవు. నాలుగు రోజులపాటు కేజీఎఫ్ మూవీని ఐదు షోలు ప్రదర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇక టికెట్ రేట్స్ చూసినట్లయితే.. ఈ విధంగా ఉన్నాయి. టికెట్ రేట్లు మల్టీప్లెక్స్‌లలో రూ. 350, సింగిల్ స్కీన్స్‌లో రూ. 200 ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణలో కేజీఎఫ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా.. విజయ్ కిరగందుర్ నిర్మించారు. శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మరి కేజీఎఫ్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.