ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా ఏదో ఓ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కన్నుమూస్తు వస్తున్నారు. తాజాగా శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. KGF నటుడు మోహణ్ జునేజా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జునేజా తన కెరీర్లో ఇప్పటి వరకు 100 సినిమాల్లో నటించారు. హస్యనటుడిగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. ఇక తాజాగా ఆయన బ్లాక్ బాస్టర్ మూవీ KGF 2లో నటించారు. ఈ చిత్రంలో ఆయన ఇన్ఫార్మర్ నాగరాజు పాత్రంలో కనిపించారు. పలువురు సినీ ప్రముఖులు జునేజా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.