కీర్తి సురేష్.. అంటే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కీర్తికి.. ఓ టాలీవుడ్ యంగ్ హీరో భర్తగా మారబోతున్నాడట. వినటానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజమే అంటున్నాయి కొన్ని కథనాలు. ఇంతకాలం పెళ్లి ఊసెత్తని కీర్తి.. అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అనే సందేహం రావచ్చు. మరి నిజంగానే కీర్తి సురేష్ ఆ హీరోతో పెళ్ళికి సిద్దమైందా.. ఆ ప్రపోజల్ ఎవరిదీ? అనేది చూద్దాం.
ఇంతకీ కీర్తి సురేష్ భర్తగా మారబోతున్న ఆ యంగ్ హీరో ఎవరో కాదు నాగశౌర్య. నాగ శౌర్యతోనే కీర్తి సురేష్ పెళ్లి? అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. కానీ ఇదంతా రియల్ లైఫ్ లో కాదండోయ్.. రీల్ లైఫ్ వరకేనట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న 155వ చిత్రం “భోళా శంకర్”. అన్నాచెల్లెల అనుబంధం నేపథ్యంలో భోళాశంకర్ మూవీ సాగనుంది. ఇందులో మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ కనిపించనుంది. అయితే.. ఈ సినిమాలో కీర్తి సురేష్‌కి పెళ్లి చూపులు జరిగే సన్నివేశం ఉందంట. ఈ సన్నివేశంలో పెళ్లి కొడుకుగా నటించేందుకు ఏకంగా ఫామ్ లో ఉన్న నాగశౌర్యను ఎంపిక చేశారట మేకర్స్.మరి మెగాస్టార్ చెల్లికి భర్తగా రావాలంటే ఆ మాత్రం ఫామ్ లో ఉన్న యాక్టర్ కావాల్సిందే అనుకున్నారట. అందుకే కీర్తికి జోడిగా నాగశౌర్య సూట్ అవుతాడని ఉద్దేశంతో అతన్ని చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తుంది. మరి చిరు సినిమాలో ఛాన్స్ కాబట్టి.. పాత్ర చిన్నదైనా నాగశౌర్య ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం శౌర్య నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రీమేక్(వేదాళం) మూవీని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.