నటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మీద దాడి చేసిన సంగతి తెలిసిందే. నడి రోడ్డుమీద అతడిని పరిగెత్తించి.. గుడ్డలూడదీసి మరి కొట్టింది కరాటే కళ్యాణి. ఈ ఘటనలో శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే కళ్యాణి మీద దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె చేతిలో బిడ్డతో సహా కిందపడిపోయింది. ఇక వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ నెటిజనులను ఓ ప్రశ్న వేధిస్తోంది. అసలు కరాటే కళ్యాణి.. ఎందుకు శ్రీకాంత్ రెడ్డి మీద దాడి చేసింది.. వారిద్దరి మధ్య ఏదైనా వివాదం చోటు చేసుకుందా.. ఏంటి అని నెటిజనులు కామెంట్స్ రూపంలో ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Karate Kalyani: నడి రోడ్డు మీద యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని కొట్టిన కరాటే కళ్యాణి.. వీడియో వైరల్!
ఈ క్రమంలో అసలు తాను ఎందుకు శ్రీకాంత్ రెడ్డిని కొట్టాల్సి వచ్చిందో వెల్లడించింది కరాటే కళ్యాణి. శ్రీకాంత్ రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. తన పక్కలో పడుకోవాలని అడిగాడని.. తన బొడ్డుపై చేయి పెట్టాడని అందుకే చెంప పగలగొట్టానంటూ వివరణ ఇచ్చింది కరాటే కళ్యాణి. తనకి దమ్ముంది కాబట్టే కొట్టానని.. జరిగింది ఇదే అంటూ చెప్పుకొచ్చిందామె. అంతేకాక శ్రీకాంత్ రెడ్డి.. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళల్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని.. ఎక్కడెక్కడో చేతులు వేసి మహిళల్ని అగౌరవ పరుస్తున్నాడని ఆరోపించింది. ఒంటరిగా ఉన్న అమ్మాయిలు, మహిళల్ని రెచ్చగొట్టి తన కామ కోర్కికలను తీర్చుకుంటున్నాడని తెలిపింది కరాటే కళ్యాణి. తనతో కూడా అలానే ప్రవర్తించాడని.. అందుకే చితకబాదానని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Adivi Sesh: చందమామ సినిమాలో ఒరిజనల్ హీరోని నేనే.. కానీ 2 రోజుల తర్వాత: అడివి శేష్అయితే శ్రీకాంత్ రెడ్డి మాత్రం.. తాను డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్ట్‌లతో ఈ ప్రాంక్ వీడియోలు చేస్తున్నానని.. ఇందులో ఆమెకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాక కరాటే కళ్యాణి సినిమాల్లో.. బాబీ అంటూ వ్యాంప్ పాత్రలు చేస్తే తప్పులేదు.. సినిమాల్లో ఊ అంటావా.. ఊఊ అంటావా.. అంటే తప్పులేదు కానీ.. తాను మాత్రం ఇలా డబ్బులిచ్చి.. పెయిడ్ ఆర్టిస్టులతో ప్రాంక్ వీడియోలు చేస్తే తప్పా. ఒకవేళ ఆమెకు నచ్చకపోతే.. ప్రశ్నించాలి కానీ ఇలా కొడతారా అని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయంలో నెటిజనులు కొందరు కరాటే కళ్యాణికి మద్దతు తెలపగా.. మరికొందరు.. దాడి చేయడం కరెక్ట్ కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే టోటల్‌గా జరిగిన ఈ ఇష్యూ మొత్తాన్ని తన ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టి వీడియోలు విడుదల చేసింది కళ్యాణి. దాడి అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Tina Sandhu: ‘ఆట’ టైటిల్ విన్నర్ టీనా మృతిపై అనుమానాలు.. మద్యం ఎక్కువవ్వడం వల్లే చనిపోయిందా?!