తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు జానీ మాస్టర్. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు జానీ మాస్టర్. ఇటీవల విజయ్ హీరోగా నటించిన బీస్ట్ మూవీలో సూపర్ హిట్ అయిన 'అరబిక్ కుతు...' సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అందులో మరో పాటను కూడా చేశారు. సూర్య నటించిన 'ఈటి - ఎవరికీ తలవంచడు' చిత్రంలోకూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ చివరి సినిమా 'జేమ్స్'లో సాంగ్ చేశారు. అంతే కాదు హిందీలో సల్మాన్ ఖాన్ 'రాధే'లో 'సీటీమార్' సాంగ్ చేశారు.తెలుగు లో వచ్చిన ఈగ చిత్రంలో విలన్ గా నటించిన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ అందరికీ సుపరిచితమే. తాజాగా జానీ మాస్టార్ కి సుదీప్ ఒక కారు గిఫ్ట్ ఇచ్చాడు. మహీంద్రా తార్ దీని విలువ సుమారు రూ: 13.17 లక్షలుగా ఉంటుందని అంచనా. కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ 'విక్రాంత్ రోణ' త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. View this post on Instagram A post shared by Jani Master (@alwaysjani)